Posts

Showing posts from August, 2018

MI A2 XIAOMI MOBILE BOOKING NOW ,MI A2 PRICE 16,999

Image
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షామీ, సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ కలిసి గతేడాది విడుదల చేసిన మొబైల్‌ ఎంఐ ఏ1. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రొగ్రామ్‌ కింద తీసుకొచ్చిన ఈ మొబైల్‌ టెక్‌ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపుగా, బుధవారం షామీ ఎంఐ ఏ2ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఎంఐఏ1తో పోలిస్తే, డిజైన్,‌ కెమెరా విభాగాలను ఈసారి మరింత బలోపేతం చేసింది. ఎంఐ ఏ2 5.99 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే(18:9)తో రానుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో వస్తున్న ఈ మొబైల్‌ 64జీబీ, 128జీబీ అంతర్గత మెమొరీతో రానుంది. మొత్తం నాలుగు రంగుల్లో ఇది లభించనుంది. నలుపు, గులాబీ, పసిడి, లేత నీలం వర్ణాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధరను రూ.16,999గా నిర్ణయించారు. ఇక 6జీబీ ర్యామ్‌+128జీబీ అంతర్గత మెమొరీ ఉన్న మొబైల్‌ ధరను ప్రస్తుతం వెల్లడించలేదు. త్వరలోనే దీని ధరను వెల్లడిస్తామని తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఎంఐ.కామ్‌తో పాటు, అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ప్రీఆర్డర్‌ ప్రారంభం కానుంది. ఆగ...