MI A2 XIAOMI MOBILE BOOKING NOW ,MI A2 PRICE 16,999
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షామీ, సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కలిసి గతేడాది విడుదల చేసిన మొబైల్ ఎంఐ ఏ1. ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్ కింద తీసుకొచ్చిన ఈ మొబైల్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపుగా, బుధవారం షామీ ఎంఐ ఏ2ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఎంఐఏ1తో పోలిస్తే, డిజైన్, కెమెరా విభాగాలను ఈసారి మరింత బలోపేతం చేసింది.
ఎంఐ ఏ2 5.99 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే(18:9)తో రానుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో వస్తున్న ఈ మొబైల్ 64జీబీ, 128జీబీ అంతర్గత మెమొరీతో రానుంది. మొత్తం నాలుగు రంగుల్లో ఇది లభించనుంది. నలుపు, గులాబీ, పసిడి, లేత నీలం వర్ణాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. ఇక 6జీబీ ర్యామ్+128జీబీ అంతర్గత మెమొరీ ఉన్న మొబైల్ ధరను ప్రస్తుతం వెల్లడించలేదు. త్వరలోనే దీని ధరను వెల్లడిస్తామని తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఎంఐ.కామ్‌తో పాటు, అమెజాన్ వెబ్‌సైట్‌లో ప్రీఆర్డర్ ప్రారంభం కానుంది. ఆగస్టు 16నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రారంభ ఆఫర్ కింద జియో వినియోగదారులు రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు, 4.5టీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు.
ఇక గత ఫోన్‌తో పోలిస్తే, కెమెరాను నవీనీకరించారు. వెనుక వైపు 12+20 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్స్ కలిగిన డ్యుయల్ కెమెరాను అమర్చారు. ఇక అద్భుతమైన సెల్ఫీల కోసం ముందువైపు 20మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొచ్చారు. ముందు కెమెరా డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా స్థాయిలో ఫొటోలను తీయగలదని కంపెనీ చెబుతోంది. ఇక ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద వస్తున్న మొబైల్ కావడంతో గూగుల్ అందించే ప్రతీ అప్‌డేట్ ఎంఐ ఏ2కు వస్తుంది. అంతేకాదు, ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ ‘పై’కు కూడా అప్‌డేట్ అవుతుంది. ఇందులో 3010 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. టైప్- సి పోర్ట్‌తో వస్తున్న ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ 4.0కు సపోర్ట్ చేస్తుంది.
షామీ ఎంఐ ఏ2 ప్రత్యేకతలు
* 5.99 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే(18:9)
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్5
* స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్/ 6జీబీ ర్యామ్
* 64జీబీ/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 12+20 మెగాపిక్సెల్ సోనీలెన్స్ వెనుక కెమెరా
* 20 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* బ్లూటూత్ 5.0
* 3010 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* ఫాస్ట్ ఛార్జింగ్ 4.0కు సపోర్ట్

Comments
Post a Comment